News October 18, 2024
పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు

ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చి మాట తప్పిందని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్‌లో చర్చించి, వెంటనే ప్రకటించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ఆనాటికి పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను అధికారంలోకి రాగానే తక్షణమే చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.
Similar News
News December 5, 2025
మెదక్ జిల్లాలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 160 పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అదే విదంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరిగే 1,402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ఇందులో 14 గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయినట్లు వివరించారు.
News December 4, 2025
మెదక్: తొలి విడతలో 144 గ్రామాల్లో ఎన్నికలు

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 160 గ్రామ పంచాయతీల్లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 1402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. 14 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అవడంతో ఈరోజు ఉపసర్పంచ్ ఎన్నిక సైతం నిర్వహించినట్లు వివరించారు. మిగిలిన 144 సర్పంచ్, 1072 వార్డులకు 11న ఎన్నికల నిర్వహిస్తున్నట్లు తెలిపారు
News December 4, 2025
మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.


