News February 17, 2025
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులను అధికారులు త్వరగా పరిష్కరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. ప్రధానంగా గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన నేరస్థుల వివరాలను సేకరించి ప్రస్తుత వారి స్థితిగతులపై పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు. దొంగతనం కేసులను త్వరగా పరిష్కరించిన అధికారులకు సీపీ అభినందనలు తెలిపారు.
Similar News
News November 28, 2025
సిద్దిపేట: ఒకే మండలం నుంచి నలుగురు ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లాలో నలుగురు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగదేవపూర్ మం. బీజీ వెంకటాపూర్‌లో పరమేశ్వర్, మాందాపూర్‌లో ముత్యం, పలుగుగడ్డ నర్ర కనకయ్య, అనంతసాగర్‌లో కుమార్‌ను గ్రామాల అభివృద్ధి దృష్ట్యా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నలుగురు బీసీ రిజర్వేషన్ కింద కేటాయించిన అభ్యర్థులే కావటం విశేషం. అయితే వారంతా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సర్పంచులవటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
News November 28, 2025
మచిలీపట్నం: మళ్లీ సేమ్ సీన్ రిపీట్..?

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావొస్తుంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి రవీంద్ర కలిసి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. ఒకట్రెండు సార్లు ప్రెస్మీట్లలో కలిసి పాల్గొన్నారు. ఇద్దరు నేతల మధ్య సమన్వయ లోపంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలోనూ మాజీ మంత్రి పేర్నినాని, ఎంపీ బాలశౌరికి అంతర్గత విభేదాలతో ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.
News November 28, 2025
సర్పంచ్ నుంచి MLAగా.. రాణించిన జిల్లా నేతలు..!

గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన పలువురు నేతలు MLAలుగా రాణించారు. వేములవాడ మండలం రుద్రవరం గ్రామ సర్పంచ్‌గా పేరు తెచ్చుకున్న రేగులపాటి పాపారావు సిరిసిల్ల ఎమ్మెల్యేగా, గంభీరావుపేట వార్డు సభ్యుడిగా పనిచేసిన కటకం మృత్యుంజయం కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగిత్యాల జిల్లా అంతర్గాం సర్పంచ్‌గా పనిచేసిన సుద్దాల దేవయ్య నేరెళ్ల ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మంత్రిగా సేవలందించారు.


