News February 17, 2025
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులను అధికారులు త్వరగా పరిష్కరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. ప్రధానంగా గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన నేరస్థుల వివరాలను సేకరించి ప్రస్తుత వారి స్థితిగతులపై పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు. దొంగతనం కేసులను త్వరగా పరిష్కరించిన అధికారులకు సీపీ అభినందనలు తెలిపారు.
Similar News
News April 13, 2026
ఉమ్మడి తూ.గో జిల్లా MLA,MPలకు సీఎం వార్నింగ్

సీఎం చంద్రబాబు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే, ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని, ఎంపీపై కూడా అసమ్మతిగానే మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యుల పెత్తనం తగ్గించుకోవాలంటూ ఓ ఎమ్మెల్యేకు, తండ్రి పెత్తనాన్ని తగ్గించు అంటూ ఓ మంత్రికి ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
News April 13, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News April 13, 2026
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు


