News February 24, 2025
పెండింగ్ కేసులను పరిష్కరించాలి: అనకాపల్లి ఎస్పీ

నిర్దిష్ట ప్రణాళికతో పాత పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చార్జిషీట్లు, సమన్లు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు.
Similar News
News January 5, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18766451>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,020 పెరిగి రూ.1,37,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,850 ఎగబాకి రూ.1,26,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 5, 2026
ఇరుసుమండ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా!

ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. లీక్ ను నియంత్రించాలన్నారు.
News January 5, 2026
KNR: నిలిచిన రిజిస్ట్రేషన్లు.. మూడు రోజులుగా ఇదే గోస!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సాంకేతిక విఘాతం ఏర్పడింది. గత 3రోజులుగా సర్వర్ మొరాయిస్తుండటంతో క్రయవిక్రయాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న వారు కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫైళ్లు పెండింగ్లో పడటంతో రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి. సాంకేతిక లోపాన్ని సరిదిద్ది ప్రక్రియను త్వరలోనే పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.


