News January 21, 2025

పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: ఏసీపీ దేవేందర్ రెడ్డి

image

పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. హనుమకొండ డివిజన్ పోలీస్ అధికారులతో ఏసీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చోరీలను కట్టడి చేయడం కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు.

Similar News

News February 17, 2025

వరంగల్: మక్కలు క్వింటా రూ.2,355

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే గత శుక్రవారం లాగే ఈరోజు కూడా మక్కలు (బిల్టీ) ధర రూ.2,355 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.7200, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

News February 17, 2025

వరంగల్‌లో “ది స్వయంవర్”

image

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ది స్వయంవర్ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 42 నగరాల్లో 85 బ్రాంచీలతో ప్రజలకు అందుబాటులో స్పెషల్ కలెక్షన్ అందిస్తోంది ది స్వయంవర్.వివాహాది శుభకార్యాలకు అద్భుతమైన కలెక్షన్ అందించడం స్టోర్ ప్రత్యేకత. పిల్లలు, పెద్దల కోసం పట్టు పంచెలు, దుపట్టా, పైజామా, కుర్తా మొదలైన వస్త్రాలు అందుబాటు ధరల్లో అందిస్తున్నట్టు ది స్వయంవర్ యాజమాన్యం తెలిపింది.

News February 17, 2025

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత శుక్రవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర గత శుక్రవారం రూ.13,600 పలకగా.. నేడు రూ.13,800కి చేరింది. అలాగే వండర్ హాట్(WH) మిర్చికి శుక్రవారం రూ.15,500 ధర రాగా.. ఈరోజు రూ. 16వేలు పలికింది. మరోవైపు 341 మిర్చికి మొన్న రూ.13,600 ధర రాగా.. ఈరోజు రూ.13,500 అయింది.

error: Content is protected !!