News January 26, 2025
పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: ఈస్ట్ జోన్ డీసీపీ

పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్ ఉన్న కేసులు త్వరగా పరిష్కరించాలని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ అధికారులకు సూచించారు. మామూనూర్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో డీసీపీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చోరీలను కట్టడి చేయడం కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని డీసీపీ స్టేషన్ అధికారులకు సూచించారు.
Similar News
News November 17, 2025
మత్స్యశాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్

కామారెడ్డి నూతన జిల్లా మత్స్య శాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న శ్రీపతి వరంగల్, హన్మకొండ జిల్లాలకు వర్క్ డిప్యూటేషన్పై బదిలీ అయ్యారు.

బుట్టాయగూడెం: పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

బుట్టాయగూడెం జడ్పీ హైస్కూల్ ప్లస్ను ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్. ఆశాలత సోమవారం సందర్శించారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్ర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు కూర్చునే ఏర్పాట్లు, గాలి, వెలుతురు, తాగునీటి సౌకర్యం, సీసీటీవీ అమరికలతో పాటు ఇతర ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.