News October 29, 2024

పెండింగ్ కేసులపై సమీక్షించిన కర్నూలు రేంజ్ డీఐజీ

image

నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న పెండింగ్ కేసులపై కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మంగళవారం సమీక్ష చేశారు. ముందుగా నంద్యాలకు వచ్చిన ఆయనకు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఘన స్వాగతం పలికారు. సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కారంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

Similar News

News November 5, 2024

కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించండి: టీజీ భరత్‌కు వినతి

image

మండల కేంద్రమైన కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసి నిర్మించాలని మంత్రి టీజీ భరత్‌కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిన మండలమైన కౌతాళంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.

News November 5, 2024

పారిశ్రామిక వాడ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు: కలెక్టర్

image

ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధిపై ఏపీఐఐసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు సంబంధించి ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న మౌలిక వసతుల పనులను పరిశీలించారు.

News November 5, 2024

రాబోయే రోజుల్లో వైసీపీ షటిల్ టీం అవుతుంది: ఎమ్మెల్యే బీవీ

image

రాబోయే రోజుల్లో వైసీపీ షటిల్ టీమ్‌ లాగా.. ఇద్దరే సభ్యులు నిలుస్తారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరులో మంగళవారం కర్నూలు-బళ్లారి హైవే మరమ్మతులకు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత వైసీపీకి క్రికెట్ టీమ్ ఉందని, భవిష్యత్తులో షటిల్ టీమ్‌గా మిగులుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.