News September 22, 2024
పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ
పెండింగ్‌లో ఉన్న కేసులు దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను SP మహేశ్వర రెడ్డి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న NDPS, సైబర్, గ్రేవ్, ప్రాపర్టీ , SC, ST, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, కేసులు పరిష్కారం, నేర నియంత్రణ తదితర అంశాలపై SP శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
Similar News
News October 7, 2024
జిల్లాలో ఇప్పటికి 64డెంగీ కేసులు.. అప్రమత్తత అవసరం: శ్రీకాకుళం DMHO
శ్రీకాకుళం జిల్లాలో వైరల్ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి ఆదివారం సూచించారు. శీతల గాలులు మొదలైన తర్వాత వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండి ఇళ్ల పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 64డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు
News October 7, 2024
ఇసుకను పొందడంలో సమస్యలా? ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
ఇసుకను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కేటాయించడం జరుగుతోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఇసుకను (https://www.sand.ap.gov.in) లో బుక్ చేసుకోవచ్చన్నారు. ఇసుక పొందడంలో సమస్యలు ఎదురైతే, 24 గంటలూ పనిచేసే జిల్లా స్థాయి ఫెసిలిటేషన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 18004256012, వాట్సాప్ నెంబర్ 9701691657ను సంప్రదించవచ్చన్నారు.
News October 6, 2024
రైలు నుంచి జారిపడి సిక్కోలు జవాన్ మృతి
రైలు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి శ్రీకాకుళం జిల్లా నందిగంకు చెందిన జీ.జగదీశ్వరరావు(37) అనే SSB(Sashastra Seema Bal) జవాన్ మృతిచెందాడు. సెలవుపై ఇంటికి వచ్చేందుకు గాను పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నుంచి రైలులో వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో తీవ్ర గాయాలై మృతిచెందాడు. రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.