News January 28, 2025
పెండింగ్ ధరణి దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ సందర్శించి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో రికార్డు రూంను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే ధరణి పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీసి, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా మీ-సేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, కుల, ఆదాయ, జనన ధ్రువపత్రాలను త్వరితగతిన జారీ చేయాలని సూచించారు.
Similar News
News February 19, 2025
ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
News February 19, 2025
దామరచర్ల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పరిసరాలు, వంటగది, తరగతి గదులు, మరుగు దొడ్లు పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తనిఖీ చేశారు. నెలలోపు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
News February 19, 2025
WGL: ‘స్మార్ట్ సిటీ పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలి’

స్మార్ట్ సిటీ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూసీ పరిధిలోస్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీచర్స్ కాలనీ ఫేజ్-1లో సీసీ రోడ్‌ను, వడ్డేపల్లి బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులు, 52వ డివిజన్ రాజాజీ నగర్ కల్వర్టు ఇతర పనులను పరిశీలించారు.