News June 14, 2024
పెండింగ్ ధరణి సమస్యలను పరిష్కరించాలి: నవీన్ మిట్టల్
పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రతి మండలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవనం లేదా భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 20, 2024
KNR: ఇక ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్!
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు విద్యాశాఖ.. ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. కాగా, జిల్లాలోని 651 ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 2,729 మంది పనిచేస్తున్నారు.
News September 20, 2024
కరీంనగర్: తీరనున్న గల్ఫ్ కష్టాలు!
ఎట్టకేలకు గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్మికుల సమస్యలపై సలహా కమిటీ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల విద్యార్థులకు గురుకుల విద్యాలయాల్లో సీట్ల కేటాయింపుకు ప్రాధాన్యత, డిసెంబర్ 7, 2023 నుంచి గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది. కాగా, ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లకు చెందిన యువత గల్ఫ్ బాట పట్టారు.
News September 20, 2024
ఇల్లంతకుంట: బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థికి పాముకాటు
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పల్లిలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థి పాము కాటు గురయ్యాడు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామవత్ రోహిత్(12) అనే విద్యార్థి బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం పాము కరిచిందని కేకలు వేశాడు. గమనించిన పాఠశాల సిబ్బంది ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.