News March 23, 2025

పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్‌లో అంగన్వాడీ కేంద్రాల భవనాలలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, మరమ్మతు పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇప్పటి వరకూ చేపట్టిన అభివృద్ధి, ఇతర వసతుల కల్పనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 9, 2025

చివ్వెంలలో తెల్లవారుజామున భారీ పేలుడు

image

చివ్వెంల మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. బ్రిక్స్ యూనిట్లోని పీడన ఫోమ్ తయారీ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగిందని స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దం భారీగా ఉండడంతో సమీపంలోని బీబీగూడెం, మున్యా నాయక్ తండా ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు తండోపతండాలుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News December 9, 2025

అల్లూరి జిల్లాలో రోడ్డెక్కనున్న నైట్ హల్ట్ బస్సులు

image

మావోయిస్టులు ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు PLGA వారోత్సవాలు ప్రకటించడంతో గిరిజన ప్రాంతానికి వచ్చే నైట్ హల్ట్ బస్సులు సోమవారం వరకు పలు ప్రాంతాలకు నిలిపివేయడం, కొన్ని బస్సులు పోలీసు స్టేషన్ సమీపంలో ఉంచడం జరిగేది. నిన్నటితో వారోత్సవాలు ముగిసాయి. నేటి నుంచి నైట్ హల్ట్ బస్సు సర్వీసులు వై.రామవరం, రాజవొమ్మంగి, రెవళ్లు యధావిధిగా నడుస్తాయని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.

News December 9, 2025

ఫ్రాడ్ కాల్స్‌ వేధిస్తున్నాయా?

image

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్‌, మెసేజ్‌లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<>https://sancharsaathi.gov.in/sfc/<<>>)లో అనుమానాస్పద కాల్స్‌ను సులభంగా కంప్లైంట్‌ చేయవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్ నంబర్, కాల్ వచ్చిన డేట్, టైమ్ వంటి వివరాలు సమర్పించాలి. ఇది టెలికం మోసాల నియంత్రణలో అధికారులకు కీలకంగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వలన ఇతరులను కూడా రక్షించవచ్చు.