News September 28, 2024

పెండ్లిమర్రి: గుంతలో పడి పశువుల కాపరి గల్లంతు

image

పెండ్లిమర్రి మండలంలోని బుడ్డాయ పల్లె సమీపంలోని మైన్స్ వద్ద ఉన్న గుంతల్లో పడి శనివారం ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. బుడ్డాయ పల్లెలోని బంధువుల ఇంటికి వచ్చిన శ్రీనివాసులు రెడ్డి పశువులను మేపుకుంటూ మైన్స్ సమీపంలోని గుంతల వద్దకు వెళ్లాడు. పశువులను బయటికి తోలే క్రమంలో అదుపుతప్పి గుంతలో పడి గల్లంతయ్యాడు. పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News December 1, 2025

కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

image

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.

News December 1, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,790
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,767
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1750

News December 1, 2025

ప్రొద్దుటూరు: చిన్నోడే పెద్ద పోరాటం!

image

ప్రొద్దుటూరుకు చెందిన 6వ తరగతి విద్యార్థి ఎబినేజర్ ధైర్యసాహసాలు మెచ్చుకోవాల్సిందే. కాలువకు రక్షణ గోడలేక తన స్నేహితుడు కిందపడ్డాడని బాలుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇలా మరొకరు ఇబ్బంది చెందకూడదని పోరాటానికి దిగాడు. కాలువకు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి విన్నవించాడు. త్వరగా రక్షణగోడ నిర్మించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆ కుర్రాడు హెచ్చరించాడు.