News May 20, 2024
పెండ్లిమర్రి టాప్.. పెద్దముడియం లాస్ట్

శనివారం నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు జిల్లాలో వర్షం కురిసింది. 32 మండలాల్లో చిరుజల్లుల నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని అత్యధికంగా పెండ్లిమర్రిలో 39.4 మి.మి., అత్యల్పంగా పెద్దముడియం మండలంలో 0.8 మి.మి. నమోదయింది. 10 మి.మి. తోపు వర్షపాతం 22 మండలాల్లో నమోదు కాగా.. 10 నుంచి 20 మి.మి. 6 మండలాలు, మరో 3 మండలాల్లో 20 మి.మి. పైగా వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 1, 2025
కడప: ‘సమస్యలపై ఇవాళ రాకండి’

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుసే అవకాశం ఉండడంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలతో రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఉండే వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వినతులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు.
News November 30, 2025
వేంపల్లె: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
News November 30, 2025
కడప జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు సెలవు

తుఫాను నేపథ్యంలో కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ సెంటర్లకు సోమవారం సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో శంషుద్దీన్ వెల్లడించారు. విద్యార్థులు కుంటలు, కాలువలు, చెరువులు, పాడుబడ్డ గోడల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.


