News August 11, 2024
పెందుర్తిలో వ్యభిచార గృహంపై దాడి
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. నిర్వాహకురాలు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని ఇద్దరు యువతులను రక్షించారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును పెందుర్తి పోలీసులకు అప్పగించారు.
Similar News
News September 19, 2024
భీమిలి: కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
భీమిలి బీచ్‌లో MP విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాజకీయ జోక్యంతో కూల్చివేతలను ఆపవద్దని సూచించింది. ఫొటోలను పరిశీలిస్తే బీచ్‌లోనే నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.
News September 19, 2024
విశాఖ: 4,972 మంది లైసెన్సులు తాత్కాలికంగా రద్దు
బైకర్‌లు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం సూచించారు. గోపాలపట్నంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తున్న 4,972 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్‌లో 5,543 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News September 19, 2024
రుషికొండలో ప్రతిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎంతో ప్రీతికరమైన తిరుమల లడ్డూ ఇక నుంచి ప్రతి రోజూ విక్రయించనున్నట్లు ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. ఇప్పటి వరకు వారంలో మూడు రోజులు మాత్రమే విక్రయించే వారమని, భక్తుల కోరిక మేరకు ఇక నుంచి ప్రతి రోజూ విక్రయిస్తామని ఆయన వెల్లడించారు.