News January 26, 2025

పెందుర్తి: బాల్కనీ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

పెందుర్తిలో గల అప్పన్నపాలెంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వెంకట సత్యనారాయణ ఇంటి బాల్కనీ నుంచి పడి మృతి చెందారు. వెంటనే భార్య హాస్పిటల్‌కు తరలించారు. తీవ్ర గాయాలవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వెంకట సత్యనారాయణ జీవీఎంసీ జోన్ -8 వేపగుంట కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News February 8, 2025

బాలిక ప్రసవంపై డీఎస్పీ విచారణ

image

భీమిలిలో చదువుతున్న అనకాపల్లి(D) చీడికాడ మండలానికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చి KGHలో <<15386000>>ప్రసవించిన సంగతి విదితమే<<>>. నెలలు నిండక ముందే 6 నెలల మగబిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు మరణించింది. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి చీడికాడ PSకి బదిలీ చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు చీడికాడ SI సతీశ్ చెప్పారు. పోక్సో కేసు కావడంతో ఈ కేసును DSP విచారిస్తారన్నారు.

News February 8, 2025

విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.

News February 8, 2025

T -10 దివ్యాంగ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న గాజువాక కుర్రాడు

image

అంగవైకల్యం ప్రతిభకు అడ్డుకాదని గాజువాక కుంచుమాంబ కాలనీకి చెందిన బి.మణికంఠ నిరూపించారు. క్రీడల్లో విశేషంగా రాణిస్తున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన దివ్యాంగ క్రికెట్ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందారు. తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ నెల 16, 17,18 తేదీల్లో వారణాసిలో జరిగే T-10 దివ్యాంగ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కి సెలెక్ట్ అయ్యారు. 

error: Content is protected !!