News November 5, 2024
పెందుర్తి: భూములు వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు

విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సోమవారం జారీ చేసిన ఉత్తర్వులను విశాఖ కలెక్టర్కు పంపించారు. 2021లో కేటాయించిన రూ.225 కోట్ల విలువచేసే 15 ఎకరాల భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
విశాఖ కమీషనరేట్లో వెయిటింగ్ హాల్ ప్రారంభం

విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కమీషనరేట్లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్శకుల వెయిటింగ్ హాల్ను ప్రారంభించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు హాల్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.
News November 18, 2025
మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి: రాయపాటి

మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్శన్ డా.రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం ఏయూ సెమినార్ హాల్లో దుర్గాబాయి దేశ్ ముఖ్ విమెన్ సెంటర్ ఫర్ స్టడీస్ ఆధ్వర్యంలో మహిళల భద్రతను నిలబెట్టడం, విజయానికి బెంచ్ మార్కింగ్ భవిష్యత్తును నిర్ధారించే అంశాలపై సెమినార్ నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాకు ‘సేఫెస్ట్ సిటీ’ అని ర్యాంకింగ్ రావడం సంతోషంగా ఉందన్నారు.
News November 18, 2025
రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.


