News December 7, 2024

పెందుర్తి: మాదకద్రవ్యాలపై పోస్టర్ ఆవిష్కరణ

image

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2025

విశాఖ: పుట్టినరోజు నాడే కానిస్టేబుల్ అభ్యర్థి మృతి

image

విశాఖ ఏఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో గురువారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది.1,600 మీటర్ల రన్నింగ్ అనంతరం సొమ్మసిల్లి పడిపోయిన శ్రవణ్ కుమార్‌ను నిర్వాహక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే శ్రవణ్ కుమార్ మృతి చెందటం పట్ల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీస్ అవుతాడానుకుంటే అందరాని దూరాలకు వెళ్లిపోయాడని విలపిస్తున్నారు.

News January 23, 2025

మోడల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దాలి: ఆమ్రపాలి

image

విశాఖ మహానగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. గురువారం వీఎంఆర్డీఏలో‌ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డీపీఆర్‌లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.

News January 23, 2025

విశాఖ: వలస వచ్చి విగత జీవులయ్యారు..!

image

బతుకుతెరువుకు ఊరొదిలి వచ్చిన ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు వెంటాడడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. <<15222234>>అగనంపూడి <<>>టోల్‌గేట్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15225242>>మృతి చెందిన <<>>గొర్లి మన్మథరావు, అరుణకుమారి దంపతులు పార్వతీపురం జిల్లా నుంచి రెండేళ్ల క్రితం వలస వచ్చారు. మన్మథరావు ఫార్మాసిటీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు నిఖిల్, కూతురు నీలిమను కర్రివానిపాలెం హైస్కూల్‌లో చదివిస్తున్నారు.