News February 16, 2025
పెందుర్తి: వరుసకు బాబాయ్.. అయినా పాడుబుద్ధి..!

వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగికంగా తనను వేధిస్తున్నాడంటూ 2023లో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి పెబ్బిలి రవికుమార్‌పై ఫిర్యాదు చేసింది. వెంటనే అతను హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల పెందుర్తి పోలీసులు రిట్ పిటిషన్ వెయ్యగా బెయిల్ రద్దవ్వడంతో అతనిని శనివారం అరెస్టు చేసినట్లు ఏసీపీ సాయి పృథ్వీ తేజ తెలిపారు. రవికుమార్ ప్రస్తుతం ఏపీ బీసీ సమైక్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
Similar News
News January 2, 2026
న్యూఇయర్ రోజు విశాఖలో యువకుడి ఆత్మహత్య

న్యూఇయర్ వేళ విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ నగర్‌కి చెందిన షణ్ముఖరావు (33) తన పిన్ని వద్ద ఉంటూ గోపాలపట్నంలో పనిచేస్తున్నాడు. ఇటీవల తన మిత్రులు జానీ, గోపాల్‌తో కలిసి బయటకు వెళ్లాడు. అక్కడ గొడవ జరగడంతో జానీని కొట్టాగా.. అతడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భయపడిన షణ్ముఖరావు మామిడి తోటలో గురువారం ఉరివేసుకున్నట్లు గోపాలపట్నం పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.
News January 2, 2026
సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం: సత్యారెడ్డి

సామాజిక న్యాయం అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సత్యారెడ్డి ఆకాంక్షించారు. సిఐటియు జాతీయ మహాసభ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ 6వ రోజు సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం థీమ్‌తో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునితీరాలని చెప్పారు.