News March 21, 2025
పెంబి: అన్నం పెట్టలేదని భార్యను చంపాడు!

అన్నం పెట్టడం లేదని భార్యని చంపాడో భర్త. ఖానాపూర్ పోలీసుల వివరాలు.. పెంబి పరిధిలోని దాసునాయక్ తండాకి చెందిన అర్జున్కు గోసంపల్లికి చెందిన నిరోజతో వివాహం జరిగింది. కాగా భర్త మద్యానికి బానిసై రోజు గొడవపడే వాడు. ఈ నెల 18న మద్యం తాగి వచ్చి భోజనం పెట్టలేదని గొడవపడ్డాడు. నిరోజను కిందపడేసి కొట్టి, గొంతుపై కాలువేసి తొక్కడంతో ఆమె మృతిచెందింది. నిరోజ అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.
Similar News
News October 18, 2025
దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి: కలెక్టర్

ఈ నెల 20న ప్రజలందరూ జరుపుకోబోయే దీపావళి పండుగను ఏ విధమైన ప్రమాదాలకు తావు లేకుండా జరుపుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడారు. అనుమతులు లేదా లైసెన్సులు లేని బాణాసంచా దుకాణాల వద్ద కొనుగోలు చేయవద్దని సూచించారు. బాణసంచా సామాగ్రిని సురక్షితమైన ప్రదేశాలలో ఉంచాలన్నారు.
News October 18, 2025
కడప: సీఎంకు ఆహ్వానం

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేని ఆహ్వానం పలికారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని, ఈ ఉత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు.
News October 18, 2025
దీపావళిని భద్రతతో జరుపుకోండి: సూర్యాపేట కలెక్టర్

దీపావళి పండుగను జిల్లా ప్రజలు జాగ్రత్తగా, భద్రతతో జరుపుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దలు పర్యవేక్షించాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా వాసులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.