News February 10, 2025

పెగడపల్లి: రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు

image

పెగడపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడు మోటలపల్లికి చెందిన కొత్తపల్లి నరసింహ చారికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ రవికిరణ్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో పశువులను కట్టివేసి రోడ్డుపై నడుస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘనటలో గాయాలు కాగా.. వెంటనే అతన్ని అంబులెన్స్‌లో జగిత్యాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 8, 2026

ప.గో: ఇరువర్గాల రాళ్ల దాడి

image

ఆకివీడు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో శనివారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంత నాగరాజు తెలిపారు. ముదురు బోయిన గోవిందస్వామి, ఆయన భార్య గంగాభవాని వర్గాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వివాదం కాస్తా రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. ఈ గొడవలో గాయపడిన వారు ఆసుపత్రిలో చేరగా, వారి నుంచి సేకరించిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 8, 2026

భూపాలపల్లి: పుర పోరులో గండ్ర Vs గండ్ర!

image

భూపాలపల్లి గడ్డపై రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ పీఠమే లక్ష్యంగా ఇద్దరు ‘గండ్ర’ల యుద్ధం మొదలైంది. అధికార కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి హస్తం స్పీడ్ పెంచగా, కారు జోరును పెంచేందుకు BRS పోటీ పడుతోంది. అభివృద్ధి మంత్రం ఒకరు, జిల్లా ఉనికి అస్త్రం మరొకరు ఇలా విమర్శలతో పురపోరు రసవత్తరంగా మారింది. గెలుపు మాదంటే మాదని ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రేపటి సీఎం సభతో రాజకీయం మరింత వేడెక్కనుంది.

News February 8, 2026

ఓపెన్ డిగ్రీతో సాఫ్ట్‌వేర్ జాబ్!

image

TG: డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. TCSతో కలిసి ‘జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ అనే స్పెషల్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీంతో డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగ నియామకపత్రం అందేలా కోర్సును రూపొందించామని వీసీ ఘంట చక్రపాణి తెలిపారు. మార్చి 15లోగా అడ్మిషన్లకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు <>వెబ్‌సైట్‌<<>>ను సంప్రదించాలన్నారు.