News February 17, 2025
పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త, మామ.. అల్లుడి మృతి

అల్లుడిపై అత్తింటి వారు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన టేకులపల్లిలో జరిగింది. SI శ్రీకాంత్ వివరాల ప్రకారం.. పాల్వంచ దంతెలబోర్‌కి చెందిన గౌతమ్ రామచంద్రునిపేటకు చెందిన కావ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత నెల కావ్య పిల్లలతో పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న గౌతమ్ భార్య, పిల్లలను చూసేందుకు పేటకు వచ్చాడు. అత్తింటి వారు గౌతమ్‌పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టగా
MGMలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News March 24, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

✓:వైరా ప్రాజెక్టును పర్యాటకంగా గుర్తించాలి: ఎమ్మెల్యే✓: చింతకాని:బావిలో పడి మహిళా కూలీ మృతి✓:సత్తుపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద బైక్-ట్యాంకర్ ఢీ✓:’ఏన్కూర్: బస్టాండ్ లేక అవస్థలు పడుతున్నాం✓:నేలకొండపల్లి మండలంలో యువకుల కొట్లాట✓:కల్లూరు: క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:SI✓:ఖమ్మం: ఆడబిడ్డ పుడితే స్వీట్లతో శుభాకాంక్షలు: కలెక్టర్
News March 23, 2025
ఖమ్మం: ఆడబిడ్డ పుడితే స్వీట్లతో శుభాకాంక్షలు

జిల్లాలో ఆడపిల్ల పుట్టిన ఇంటికి అధికారులు వెళ్లి మిఠాయి బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలని, ‘గర్ల్ ప్రైడ్’ పేరిట ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమ్మాయి పుట్టడం శుభ సూచకమనే ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇటీవల దివ్యాంగులకు కలెక్టరేట్లో ఉచిత భోజనం వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.
News March 23, 2025
ఖమ్మం: రెండో రోజు 34 మంది విద్యార్థుల గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం పదో తరగతి హిందీ పరీక్షకు 34మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ తెలిపారు. మొత్తం 16,386 మంది విద్యార్థులకు గాను 16,352మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఎనిమిది పరీక్ష కేంద్రాలను డీఈవో, 37 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.