News May 19, 2024
పెట్రోల్ బంక్ యజమానులకు అనంత ఎస్పీ హెచ్చరికలు

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం పెట్రోల్ బంక్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాటిళ్లలో పెట్రోలు వేయకూడదని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ను వాహనాలకు మాత్రమే సరఫరా చెయ్యలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు నిబంధనలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News November 17, 2025
అనంతపురం: పోలీసుల PGRSకు 83 పిటిషన్లు.!

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అర్బన్ DSP శ్రీనివాసరావు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా SP ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 83 పిటీషన్లు వచ్చాయి. పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.