News August 22, 2024
పెడన : ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు

పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులు కావాలని కళాశాల ప్రిన్సిపల్ కేసీఎన్ వీఎస్ రామారావు కోరారు. జనరల్ కామర్స్-1, వొకేషనల్ కామర్స్-1 పోస్టుకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు ఎంకాంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఈ నెల 23 సాయంత్రం 4గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 24న మచిలీపట్నం లేడీయాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డెమో, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.
Similar News
News December 9, 2025
కృష్ణా: డీఈఓ బదిలీ.. నూతన డీఈఓగా సుబ్బారావు

కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు బదిలీ అయ్యీరు. పల్నాడు జిల్లాకు రామారావును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో యూవీ సుబ్బారావును నియమించారు. సుబ్బారావు ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన మచిలీపట్నం డీవైఈఓగా విధులు నిర్వర్తించారు. సౌమ్యుడుగా, వివాదరహితునిగా సుబ్బారావు పేరు తెచ్చుకున్నారు.
News December 9, 2025
గన్నవరం-ఢిల్లీ ఇండిగో సర్వీస్ ఈ నెల 11 వరకు రద్దు

విజయవాడ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో రెగ్యులర్ సర్వీసులను ఆపరేషనల్ కారణాల వల్ల డిసెంబర్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్లైన్ ప్రకటించింది. విమానం రద్దు కావడంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీషెడ్యూల్ లేదా రిఫండ్ కోసం కస్టమర్ కేర్ను సంప్రదించాలని ఇండిగో సూచించింది.
News December 8, 2025
మచిలీపట్నం: అనాథ పిల్లలకు అమృత ఆరోగ్య కార్డులు

మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాథ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాథ పిల్లలకు ఆరోగ్య కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి ఆరోగ్య భద్రతపై అవగాహన కూడా కల్పించారు.


