News October 1, 2024
పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని నల్గొండ,సూర్యాపేట, యాదాద్రి జిల్లావాసులు ఆలోచనలు పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News October 11, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ నియోజకవర్గం జీవీ గూడెం, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండ, మునుగోడు నియోజకవర్గం కల్వకుంట్ల గ్రామంలో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నారు.
News October 11, 2024
నల్లగొండ: ‘డీఎస్సీ- 2024 ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాలి’
డీఎస్సీ-2024 లో ఎంపికైన అభ్యర్థులు 10,11 తేదీలలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అధికారి బి.బిక్షపతి తెలిపారు. డీఎస్సీ -2024 ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేసే సమయంలో ఎల్బీ స్టేడియంలో అందించిన అపాయింట్ ఆర్డర్ జిరాక్స్ జత చేసి సంబంధిత కౌంటర్లు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అధికారి బి.బిక్షపతి తెలిపారు.
News October 11, 2024
NLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా సద్దుల బతుకమ్మ సందడి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజులు పాటు మహిళలు తీరక్క పూలతో బతుకమ్మలు తయారుచేసి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఆటపాటలతో బతుకమ్మలు ఆడారు. చివరి రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా ఊరూరా బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను చెరువులు,కుంటలలో నిమజ్జనం చేశారు.