News October 1, 2024

పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఖమ్మం, భద్రాద్రి జిల్లావాసులు ఆలోచనలు పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

Similar News

News October 5, 2024

KTDM: సమాధి వద్దే సూసైడ్ అటెంప్ట్

image

ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. వెంకటేశ్‌కి వరుసకు కొడుకయ్యే ప్రవీణ్ ఇటీవల మృతిచెందాడు. ప్రవీణ్ సమాధి వద్దకు వెళ్లిన వెంకటేశ్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గమనించిన బంధువులు అతణ్ని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News October 5, 2024

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు అవకాశం

image

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అర్హులైన ఉపాధ్యాయులు నవంబర్ 6 లోపు ఫారం19 ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. గతంలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

News October 4, 2024

ఖమ్మం: పువ్వాడ సైలెంట్.. ఎందుకు..?

image

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సైలెంట్ అయ్యారనే చర్చ నడుస్తొంది. జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవడం లేదని, ఏదో అడపాదడపా HYDలో జరిగే ప్రెస్ మీట్‌లకు హాజరవుతున్నారని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. పువ్వాడ ఎందుకు సైలెంట్ అయ్యారనే విషయం తమకు తెలియదని, తిరిగి పువ్వాడ జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్ చేసి, జోష్ పెంచాలని పలువురు నేతలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?