News November 20, 2024
పెదకాకానిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
పెదకాకాని మండల కేంద్రంలోని బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్ నుంచి గౌడ పాలానికి వెళ్లే రోడ్ దగ్గర ఓ కాలేజ్ బస్సు స్కూటీని ఢీకొంది. స్కూటీ మీద వెళుతున్న దంపతుల్లో.. భార్య పావని (23) మృతి చెందారు. భర్త శివకృష్ణ (25) కాళ్లు విరిగాయి. పెదకాకాని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 4, 2024
పశువులను సురక్షితమైన షెల్టర్లుకి తరలించాలి: కలెక్టర్
విపత్తుల సమయంలో ప్రజలతో పాటు పశువులను రక్షిత ప్రాంతాల్లోకి తరలించేలా ముందస్తుగా ఆశ్రయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుంటూరుజిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. బుధవారం రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాగా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజలు పశువులను వదిలి పునరావాస కేంద్రాలకు రావటానికి ఆసక్తి చూపటం లేదని కలెక్టర్ తెలిపారు.
News December 4, 2024
పల్నాటి మహా వీరుడు.. మాల కన్నమదాసు
11వ శతాబ్దంలో మహాభారతాన్ని తలపించిన పల్నాటి యుద్ధం ఓ మహావీరుని విజయానికి ప్రతీక అని చరిత్ర చెబుతుంది. అతడే మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు.. అతి వీర భయంకరుడు ‘మాల కన్నమదాసు’. బ్రహ్మనాయుడి దత్తపుత్రునిగా రాజాజ్ఞను పాటిస్తూ సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న సహకారంతో నాగమ్మను ఓడించి మాచర్లకు విజయాన్ని చేకూర్చాడని చరిత్రలో లిఖించబడింది. యుద్ధంలో కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గం నేటికీ పూజలందుకోవడం విశేషం.
News December 4, 2024
అమరావతి ప్రాంతంలో కంపించిన భూమి
గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు, పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లాలో పలుచోట్ల నాలుగు సెకన్ల పాటు రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీ ప్రాంతంలో ఎక్కడైనా కంపించిందా కామెంట్ చేయండి.