News December 29, 2024

పెదకాకాని: మహిళ అనుమానాస్పద మృతి

image

పెదకాకాని(M) నంబూరులో మల్లికా(29) అనే మహిళ శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. మల్లిక మొదటి భర్తతో విడిపోయి ప్రేమ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య మంచంపై శవమై ఉంది. మెడ మీద గాయాలు ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. సీసీ కెమెరాలో ఇద్దరు మాస్కులు ధరించి వచ్చి వెళ్లినట్లు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 13, 2025

దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

image

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు బుధవారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.12,550 పలికాయి. కాయ క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.11,200, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.11,800 పలకగా, మొత్తం 308 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.

News November 13, 2025

తొలితరం సంపాదకులు మన పండితారాధ్యుల నాగేశ్వరరావు

image

తొలితరం సంపాదకులైన పండితారాధ్యుల నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ఇంటూరులో జన్మించారు. గుంటూరులోని AC కళాశాలలో విద్యాభ్యాసం చేసిన ఆయన, పిఠాపురం మహారాజావారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు, ఆచార్య రంగా నెలకొల్పిన వాహిని పత్రికలో1932లో చేరారు. 1943-1959 ఆంధ్రపత్రికలో, 1960లో ఆంధ్రభూమిలో,1965లో ఆంధ్రజనతకు, 1966 నుంచి 1976 మరణించే వరకూ ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. నేడు ఆయన వర్ధంతి

News November 13, 2025

GNT: పేకాట ఆడిన పోలీసుల్ని సస్పెండ్ చేసిన ఎస్పీ

image

పేకాట ఆడుతూ పట్టుబడిన పోలీసులను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేశారు. పెదకాకాని ఏఎస్ఐ వెంకట్రావు, గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణ, తుళ్లూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ గత కొద్దిరోజుల క్రితం ఓ హోటల్లో పేకాట ఆడారని చెప్పారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘించడంతో వారిని సస్పెండ్ చేశామని ఎస్పీ తెలిపారు.