News December 29, 2024
పెదకాకాని: మహిళ అనుమానాస్పద మృతి
పెదకాకాని(M) నంబూరులో మల్లికా(29) అనే మహిళ శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. మల్లిక మొదటి భర్తతో విడిపోయి ప్రేమ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య మంచంపై శవమై ఉంది. మెడ మీద గాయాలు ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. సీసీ కెమెరాలో ఇద్దరు మాస్కులు ధరించి వచ్చి వెళ్లినట్లు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 16, 2025
GNT: భారత సైన్యంలో సేవలందించని గడపలు ఆ ఊళ్లో లేవు
భారత సైనిక వ్యవస్థలో నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామంలోని 98 శాతం ఇళ్లలో సైనికులు, మాజీ సైనికులు ఉన్నారు. దీంతో బావాజీపాలెం మిలటరీ గ్రామంగా ప్రసిద్ధి చెందింది.1965 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్ధం, 1999 కార్గిల్ ఇలా ప్రతి యుద్ధంలో ఈ గ్రామ సైనికులు పాల్గొన్నారు. ఈ గ్రామాన్ని 1978లో భారత ఆర్మీ దత్తతు తీసుకొని గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మించింది.
News January 14, 2025
రేపు గుంటూరు రానున్న బాబీ, తమన్
గుంటూరు ఐటీసీ హోటల్ నుంచి మైత్రి మూవీస్ వరకు బుధవారం ఉదయం 10.30 గంటలకు జరగనున్న బైక్ ర్యాలీలో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొంటారని గుంటూరు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు బెల్లంకొండ సురేశ్ మంగళవారం తెలిపాడు. అనంతరం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను అభిమానులతో బాబీ, తమన్, డిస్టిబూటర్స్ చూడనున్నారని తెలిపారు. ఈ ర్యాలీని బాలయ్య అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.
News January 14, 2025
చేనేతలపై అభిమానాన్ని చాటుకున్న మంత్రి లోకేశ్
చేనేతలపై అభిమానాన్ని మంత్రి లోకేశ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్లిన లోకేశ్, భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవకాశం ఉన్న ప్రతిచోట భార్య బ్రహ్మణి మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.