News April 28, 2024
పెదకూరపాడులో నీటి గుంతలో దిగి చిన్నారులు మృతి

పెదకూరపాడు మండలం కన్నెగండ్ల గ్రామంలో శనివారం ఇద్దరు చిన్నారులు నీటి గుంతలతో దిగి మృత్యువాత పడ్డారు. వేణుగోపాల్ (11), ధనుష్ (13)లు వేసవి సెలవులు కావడంతో మేనమామ ఊరు కన్నెగండ్లకు వచ్చారు. అయితే శనివారం సాయంత్రం అల్లిపరవు వాగు వద్ద ఉన్న పొలాలకు నీరు నిల్వ చేసుకోవడానికి తవ్విన గుంతలో ఈతకు దిగారు. గుంతలో మట్టి చేరి ఉండడంతో ఇరుక్కుపోయి ఊపిరి ఆడగా మృతి చెందారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 21, 2025
ప్రజల్లో సంతృప్తికర స్థాయి పెరగాలి: సీఎం చంద్రబాబు

ఆర్టీజీఎస్లో ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ పౌర సేవలు, సంక్షేమ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందే సేవలు, వారిలో సంతృప్తి స్థాయి సాధించే అంశంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ విజయానంద్, ఐటీ, ఆర్టీజీ, ఆర్ధిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.
News October 21, 2025
మెప్మా-మన మిత్ర యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే.. అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించి మన మిత్ర యాప్ను ప్రారంభించారు.
News October 21, 2025
పంటపొలాలకు సాగునీటి పై దృష్టి పెట్టాలి: కలెక్టర్

జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందించేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో జలవనరుల శాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు నీటి కాలువలు కింద ఉన్న తాగునీటి చెరువులను నింపుటకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గుంటూరు ఛానల్ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.