News March 8, 2025
పెదకూరపాడు: విద్యార్థిని ఆత్మహత్య

పెదకూరపాడు (M) జలాలపురంలో విషాద ఘటన నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాణి నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. చదువు ఇష్టం లేదని చెప్పడంతో ఇంట్లో వాళ్లు మందలించారు. చదవకపోతే పనులకు రావాలని చెప్పి తల్లి తీసుకెళ్లింది. మిరప కోతకు వెళ్లగా పొలంలో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.
Similar News
News March 22, 2025
అచ్చంపేట: ప్రమాదకరంగా మారిన కల్వర్టు

అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టుకు రక్షణ లేక ప్రమాదకరంగా మారింది. ఈ ప్రధాన రహదారిపై రోజుకు హైదరాబాద్, దేవరకొండ ప్రాంతాలకు వందల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. ఈ రహదారి పై ఉన్న కల్వర్టుకు రెండు వైపులా ఎలాంటి రెయిలింగ్ లేకపోవడంతో వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
News March 22, 2025
ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూడేరు మండలం చోళ సముద్రంలో రైతు ఎర్రస్వామి పొలంలో ఫారంపాండ్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ పనులను శనివారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేశామన్నారు. ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
News March 22, 2025
నిజామాబాద్ జిల్లాకు రేపు ముఖ్యమంత్రి రాక..!

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమలలో వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.