News April 18, 2024
పెదగోగాడ గెడ్డలో పడి ఆర్మీ ఉద్యోగి మృతి
గెడ్డలో పడి ఆర్మీ ఉద్యోగి మృతి చెందినట్లు చీడికాడ ఎస్సై జి.నారాయణరావు బుధవారం తెలిపారు. బుచ్చెయ్యపేట మం. పి.భీమవరంకి చెందిన పడాల వరహాలు ఆర్మీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సెలవుపై స్వగ్రామం వచ్చిన వరహాలు దేవరాపల్లి మం. వాకపల్లిలో అత్తవారింటికి బయలుదేరాడు. పెదగోగాడ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న గెడ్డలో పడిపోయాడు. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News September 16, 2024
జీకే.వీధి: పచ్చకామెర్లతో విద్యార్థిని మృతి.?
గూడెం కొత్తవీధి మండలంలో మరో విషాదం నెలకొంది. ఆర్వీ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని జంపారంగి.ధార అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు టీడీపీ నేత సత్తిబాబు తెలిపారు. పచ్చకామెర్లతో బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
News September 16, 2024
అరకులోయ: మళ్లీ పెరిగిన అల్లం ధరలు
అల్లం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల మన్యంలో వర్షాలు అధికంగా పడటంతో అల్లం పంట దెబ్బతింది. దీంతో దిగుడులు తగ్గి డిమాండ్ ఏర్పడింది. జూన్, జులై నెలల్లో అల్లం ధర కేజీ రూ.150 ఉండగా ఆ తరువాత కేజీ రూ.120 నుంచి రూ.130కి తగ్గింది. ప్రస్తుతం చింతపల్లిలో కేజీ రూ.200కు విక్రయిస్తున్నారు. త్వరలో కొత్త అల్లం మార్కెట్లోకి వస్తుంది. ఇది వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.
News September 16, 2024
విశాఖ: జిల్లాకు అదనంగా 150 నుంచి 200 రేషన్ డిపోలు
విశాఖ జిల్లాలో రేషన్ డిపోల సంఖ్య 150 నుంచి 200 వరకు పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రాష్ట్రం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో 642 రేషన్ డిపోల పరిధిలో 5.29 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతూ వస్తున్నా డిపోలు మాత్రం పెరగలేదు. ఈనెల 30 నుంచి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.