News April 7, 2025
పెదతాడేపల్లి గురుకులానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పాఠశాలకు చెందిన 450 మంది విద్యార్థులు స్కౌట్స్, గైడ్స్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా ఈ రికార్డు సాధించినట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర పరిశీలకులు సిరిమువ్వ శ్రీనివాస్ ఆదివారం WAY2NEWS ప్రతినిధికి తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.
Similar News
News December 3, 2025
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు తత్కాల్ అవకాశం: DEO

ఏపీ ఓపెన్ స్కూల్ 2025–2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తత్కాల్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 2 నుంచి 6 వరకు అవకాశం ఉందని డీఈవో నారాయణ తెలిపారు. విద్యార్థులు రూ.600 అపరాధ రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని అన్నారు. పూర్తి వివరాలను https://apopenschollo.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని ఆయన సూచించారు.
News December 3, 2025
కొబ్బరి రైతులకు ‘సీఎఫ్‌సీ’ వరం.. రూ. 2.24 కోట్లు మంజూరు

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులు, అనుబంధ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. కొబ్బరి క్లస్టర్ పరిధిలో అత్యాధునిక కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.29.97 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర వాటా కింద ఉన్న రూ. 4.49 కోట్లలో, తొలి విడతగా సగం నిధులు, అంటే రూ. 2.24 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
News December 3, 2025
ధాన్యం రక్షణకు బరకాలు వినియోగించుకోవాలి: జేసీ

సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలలో రైతులకు బరకాలు అందుబాటులో ఉన్నాయని జేసీ రాహుల్ మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 11 వేల బరకాలు ఉన్నాయన్నారు. వీటిని రైతులు వినియోగించుకున్నందుకు ఎటువంటి చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కళ్లాల్లో ఉన్న రైతులు తమ ధాన్యం తడవకుండా వెంటనే బరకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ సూచించారు.


