News April 4, 2024
పెదపాడు జాతీయ రహదారిపై మరో ప్రమాదం

పెదపాడు మండల పరిధిలోని తాళ్లమూడి జాతీయ రహదారిపై గురువారం ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో టీడీపీ నాయకులు సుగ్గసాని గంగయ్యతో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో గన్నవరం విమానాశ్రయం నుంచి దుగ్గిరాల వస్తున్న చింతమనేని ప్రమాద పరిస్థితిని చూసి హైవే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News April 25, 2025
పాలకొల్లు: సీఎం, డిప్యూటీ సీఎంకి హరిరామజోగయ్య లేఖ

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో కాపులకు EWS కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 103 రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాపుల అభ్యున్నతికి తోడ్పడవల్సిందిగా ఆ వర్గం తరఫున కోరుతున్నానని పేర్కొన్నారు.
News April 25, 2025
యలమంచిలి: వ్యక్తిని దారుణంగా చంపిన దంపతులు

యలమంచిలి మండలం కొంతేరులో కత్తుల పౌలు(59) <<16199598>>హత్యకు గురైన సంగతి తెలిసిందే<<>>. ఈ కేసుపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న పౌలు, ఏసుదాసు కుటుంబాల మధ్య పాత కక్షలున్నాయి. బుధవారం రాత్రి పౌలు ఇంటికి వెళ్లిన ఏసుదాసు మంచంపై నిద్రిస్తున్న పౌలుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఇందుకు ఏసుదాసు భార్య భారతి కూడా సహకరించింది. నిందితులు ఏసుదాసు, భారతీలను అదుపులోకి విచారిస్తున్నారు.
News April 25, 2025
భీమవరం: విద్యార్థులను సత్కరించిన కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం కాళ్ల మండలం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన 10 మంది విద్యార్థులకు మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.