News November 8, 2024

పెదపారుపూడి: మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

పెదపారుపూడిలో జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూసి, కాసేపు ముచ్చటించారు. మధ్యాహ్న భోజన పథకం మెనూ డిస్ ప్లేను పరిశీలించారు. మెనూ ప్రకారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు అందించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 

Similar News

News October 28, 2025

కృష్ణా: చేనేత కార్మికుల జీవితాలు చీకట్లోకి.!

image

ఏడాదిగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మగ్గాల లోపల నీరు చేరి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా చేనేత కార్మికులు పనిలేక అర్ధకలితో రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొసైటీలు కూడా కార్యకలాపాలు కొనసాగించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు.

News October 28, 2025

కృష్ణా: నేడు సినిమా థియేటర్లు మూసివేత

image

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజు జిల్లాలోని అన్ని సినిమా హాల్స్‌ను మూసి వేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి సినిమా ప్రదర్శనలు వేయకుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు.

News October 27, 2025

కృష్ణా: రిలీఫ్ క్యాంప్‌ల్లో 1,482 మంది

image

మొంథా తుపాన్ తీవ్రత పెరుగుతుండటంతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వస్తున్నారు. జిల్లాలో మొత్తం 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి 1,482 మంది ఈ కేంద్రాలకు చేరుకున్నారు. మచిలీపట్నం డివిజన్ లోని 92 కేంద్రాల్లో 1,230 మంది, గుడివాడ డివిజన్ లోని 36 కేంద్రాల్లో 82 మంది, ఉయ్యూరు డివిజన్ లోని 61 కేంద్రాల్లో 170 మంది పునరావాసం పొందుతున్నారు.