News April 6, 2025

పెదపూడి: కరెంటు స్తంభం పడి మహిళ మృతి

image

శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి పెదపూడి మండలం పైన గ్రామంలో ఓ కొబ్బరి చెట్టు, విద్యు‌త్ స్తంభం పడిపోయాయి. ఈ ఘటనలో కే.మేరీ(45) అనే మహిళకు తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం వెంటనే అంబులెన్స్ లో కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 27, 2025

స్మృతి మంధానకు మద్దతుగా నిలిచిన జెమీమా

image

తండ్రి అనారోగ్యంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్మృతి మంధాన కోసం తోటి క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మృతి ఫ్యామిలీకి మద్దతుగా నిలిచేందుకు బిగ్ బాష్ లీగ్ మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహించే బ్రిస్బేన్ హీట్ ఈ విషయం వెల్లడించింది. స్మృతి పెళ్లి కోసం జెమీమా ఇండియాకు వచ్చారని, పెళ్లి ఆగిపోవడంతో ఫ్రెండ్‌కు సపోర్ట్ కోసం ఇక్కడే ఉంటానని తెలిపారని పేర్కొంది.

News November 27, 2025

‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్‌పై కామెంట్స్.. SRనగర్‌లో ఫిర్యాదు

image

సింగర్ మంగ్లీ తన తాజా పాట ‘బాయిలోనే బల్లి పలికే’పై జనాదరణ పొందింది. అటువంటి పాట మీద ఓ వ్యక్తి అసభ్యకరంగా, కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడంటూ SRనగర్ PSలో ఆమె ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తన పాటనే కాకుండా, జాతిని ఉద్దేశిస్తూ నీచంగా మాట్లాడారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఓ వర్గాన్ని కించపరిచిన ఆ వ్యక్తిని శిక్షించాలని పోలీసులను మరోవైపు కొందరు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నాయి.

News November 27, 2025

NIT వరంగల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

<>NIT <<>>వరంగల్‌ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంఏ (ఫ్రెంచ్, జర్మన్), పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/