News April 6, 2025
పెదపూడి: కరెంటు స్తంభం పడి మహిళ మృతి

శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి పెదపూడి మండలం పైన గ్రామంలో ఓ కొబ్బరి చెట్టు, విద్యుత్ స్తంభం పడిపోయాయి. ఈ ఘటనలో కే.మేరీ(45) అనే మహిళకు తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం వెంటనే అంబులెన్స్ లో కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 20, 2025
చిత్తూరు జిల్లాలో వేసవి తాపం

చిత్తూరు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం 41 డిగ్రీలకు పెరిగాయి. నగరిలో 41.4, శ్రీరంగ రాజపురం, తవణంపల్లె మండలాల్లో 41.2, గుడిపాల, చిత్తూరు మండలాల్లో 40.8, యాదమరిలో 40.3, గంగాధరనెల్లూరులో 40.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగారుపాళ్యంలో 38.6, పులిచెర్ల, పూతలపట్టు, రొంపిచెర్ల, వెదురుకుప్పం మండలాల్లో 38.1, చౌడేపల్లె, ఐరాల, కార్వేటినగరం, నిండ్ర, పాలసముద్రంలో 37.7 డిగ్రీలు నమోదైంది.
News April 20, 2025
యద్దనపూడి: భార్యను హతమార్చిన భర్త

బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
VZM: మహిళ దారుణ హత్య

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా దుండగులు చాక్‌తో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.