News February 8, 2025

పెదపూడి: విద్యుత్ షాక్‌తో టెక్నీషియన్ మృతి

image

పెదపూడి సినిమా సెంటర్ వద్ద విద్యుత్ షాక్‌తో వాటర్ సర్వీసింగ్ టెక్నీషియన్ మృతి చెందినట్లు పెదపూడి ఎస్ఐ రామారావు శనివారం తెలిపారు. వానపల్లి బుజ్జి అనే టెక్నీషియన్ వాటర్ సర్వీసింగ్ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ గురికావడంతో ప్రమాదం సంభవించినట్లు ఎస్ఐ రామారావు వివరించారు. టెక్నీషియన్ మృతిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Similar News

News February 8, 2025

ఢిల్లీలో కాంగ్రెస్ ‘జీరో హ్యాట్రిక్’ రికార్డ్ ఇందుకేనేమో?

image

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నఢిల్లీ, ప్రస్తుతం సున్నాలతో హ్యాట్రిక్ కొట్టింది. 2013లో హస్తం పార్టీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రజలు ఆప్ వైపు మెుగ్గుచూపారు. షీలాదీక్షిత్ తర్వాత మోదీ, కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే నాయకుడు దొరకలేదు. కిందిస్థాయి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైంది. వీటితో పాటు ఇండియా కూటమి విభేదాలు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నారు.

News February 8, 2025

రేపు ఏలూరు అంబికా థియేటర్‌కు తండేల్ చిత్ర యూనిట్ 

image

హీరో నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఏలూరు అంబికా థియోటర్‌కు చిత్ర యూనిట్ రానున్నట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటలకు థియేటర్‌కు హీరో నాగచైతన్య‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరవుతారని తెలిపారు. 

News February 8, 2025

HYD: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత

image

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.

error: Content is protected !!