News February 8, 2025

పెదపూడి: విద్యుత్ షాక్‌తో టెక్నీషియన్ మృతి

image

పెదపూడి సినిమా సెంటర్ వద్ద విద్యుత్ షాక్‌తో వాటర్ సర్వీసింగ్ టెక్నీషియన్ మృతి చెందినట్లు పెదపూడి ఎస్ఐ రామారావు శనివారం తెలిపారు. వానపల్లి బుజ్జి అనే టెక్నీషియన్ వాటర్ సర్వీసింగ్ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ గురికావడంతో ప్రమాదం సంభవించినట్లు ఎస్ఐ రామారావు వివరించారు. టెక్నీషియన్ మృతిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Similar News

News March 28, 2025

కోనసీమలో జిల్లాలో ముగిసిన వైస్ ఎంపీపీ ఉప ఎన్నికలు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం ఒక ఎంపీపీ, 3 వైస్ ఎంపీపీలకు ఎన్నికలు జరిగాయి. కాట్రేనికోన ఎంపీపీగా వైసీపీకి చెందిన కోలాటి సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సఖినేటిపల్లి వైస్ ఎంపీపీలుగా వైసీపీకి చెందిన కొల్లాబత్తుల సుధాకర్, గుబ్బల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పి.గన్నవరం వైస్ ఎంపీపీగా జనసేనకు చెందిన పప్పుల వెంకట సాయిబాబు ఎన్నికయ్యారు.  ఉపఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి .

News March 28, 2025

HYD: మీరు ఇందులో నీళ్లు తాగుతున్నారా?

image

RO ప్లాంట్లు HYDలో విపరీతంగా పుట్టుకొచ్చాయి. కిరాణా షాపుల్లోనూ 20L వాటర్ రూ.15-20కి విక్రయిస్తున్నారు. ఈ ప్లాంట్ల నీరు తాగడంతో కిడ్నీల సమస్యలు, జట్టురాలడం, గుండె సమస్యలు వస్తాయని రుజువైంది. సోడియం సల్ఫేట్, పొటాషియం వంటి ఖనిజాలు కలిపితేనే మినరల్ వాటర్. RO వాటర్‌లో ఇవన్నీ ఉండవు. నాసీరకం క్యాన్లలో నీరుతాగినా ప్రమాదాన్ని కొనుక్కున్నట్లే. సర్టిఫైడ్ ప్లాంట్లలో, నాణ్యమైన డబ్బాల్లో నీటిని తెచ్చుకోవాలి.

News March 28, 2025

మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. చేగుంట 40.0, నిజాంపేట్, హవేలిఘనపూర్ 39.9, కౌడిపల్లి 39.8, చిలపిచెడ్, నర్సాపూర్, కుల్చారం 39.7, పెద్దశంకరంపేట్, మెదక్ 39.6, అల్లాదుర్గ్ 39.5, రేగోడ్ 39.4, వెల్దుర్తి 39.2, పాపాన్నపేట్ 39.1, టేక్మాల్ 38.8°Cల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

error: Content is protected !!