News February 26, 2025
పెదపూడి: శివరాత్రి ఉత్సవాల్లో యువకుడి మృతి

పెదపూడి మండలం కైకవోలులో శివరాత్రి ఉత్సవాలలో అపశ్రుతి చోటుచేసుకుంది. పెదపూడి ఎస్సై రామారావు వివరాల మేరకు.. మంగళవారం కైకవోలు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలకు విద్యుత్ అలంకరణ చేపట్టారు. గ్రామానికి చెందిన యువకుడు గుర్తుల కాశీ విశ్వేశ్వరరావు (25) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ తరలించినట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News October 14, 2025
రైతు జీవితానికి చిహ్నం!

ఒకప్పుడు రైతు జీవితానికి ప్రతీకగా ఉన్న ఎద్దులు నేటి కాలంలో కనుమరుగవుతున్నాయి. ట్రాక్టర్లు, యంత్ర వ్యవసాయం ప్రబలడంతో ఎద్దుల అవసరం తగ్గిపోయింది. పంట సీజన్‌లో మాత్రమే కొందరు రైతులు వాటిని ఉపయోగిస్తున్నారు. ఆధునికత పెరుగుతున్న కొద్దీ గ్రామీణ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు క్రమంగా అంతరించిపోతున్నాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మరి మీరు ఎద్దులతో సేద్యం చేశారా? కామెంట్ చేయండి..
News October 14, 2025
MDK: మహిళపై లైంగిక దాడి, హత్య.. జీవిత ఖైదు: SP

మెదక్ పట్టణంలో 2020లో జరిగిన మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయమూర్తి నీలిమ సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడైన ఫకీరానాయక్‌కు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. కల్లు దుకాణం వద్ద పరిచయం పెంచుకుని, పొలానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు
News October 14, 2025
మన్యం జిల్లాకు 200 మంది ఉపాధ్యాయులు: DEO

మెగా DSC ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు 200 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించినట్లు DEO రాజ్ కుమార్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు 97 మంది, 103 మంది ఎస్జీటీలు జాయిన్ అయ్యారు. సాలూరులో 39, బలిజిపేటలో 20, గుమ్మలక్ష్మిపురంలో 18, గరుగుబిల్లిలో 8, జియ్యమ్మవలసలో 21, కొమరాడలో 9, కురుపాంలో 21, మక్కువలో 14, పాచిపెంటలో 28, పార్వతీపురంలో 19, సీతానగరంలో ముగ్గురు విధుల్లో చేరినట్లు చెప్పారు.