News March 27, 2025

పెదబయలు: అనారోగ్యంతో విద్యార్థిని మృతి

image

పెదబయలు మం. కులుభ గ్రామానికి చెందిన వసంత కుమారి వైజాగ్ KGH లో చికిత్స పొందుతూ మృతి చెందిందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రజని గురువారం తెలిపారు. పెద్దగురువు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఈనెల 22న ఫీట్స్ రావడంతో నిర్వాహకులు పాడేరు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్సకు KGHలో జాయిన్ చేశారు. లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

Similar News

News November 19, 2025

మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణ, శాఖలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంపు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

News November 19, 2025

కృష్ణా: 1.33 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం

image

పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో 1,33,856 మంది రైతులకు 2వ విడత రూ. 88.49 కోట్ల ఆర్థిక సాయం మంజూరైనట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మెగా చెక్కును మంత్రి రవీంద్ర రైతులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గోపిచంద్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుంచే నాని, తదితరులు పాల్గొన్నారు.

News November 19, 2025

17వ వార్షికోత్సవంలోకి ట్రూ జోన్ సోలార్

image

తెలంగాణకు చెందిన పాన్-ఇండియా సోలార్ కంపెనీ అయిన ట్రూజోన్ సోలార్ (సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్) బుధవారంతో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో 17వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కొన్ని సంవత్సరాలుగా ట్రూజోన్ దేశంలోని అత్యంత విశ్వసనీయ సోలార్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించింది. కస్టమర్-ఫస్ట్ విధానంతో ట్రూజోన్ సోలార్ భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడానికి కట్టుబడి ఉంది.