News December 24, 2024
పెదబయలు: ఏ-2 నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

2014లో పెదబయలు మండలంలోని కుంతుర్ల గ్రామానికి చెందిన మజ్జి బాలరాజు అనే వ్యక్తి, అడవి పందుల కోసం వేసిన విద్యుత్ ఉచ్చులో పడి మృతి చెందాడని ఎస్సై కే.రమణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారన్నారు. అయితే ఈ ఘటనకు కారణమైన వారిలో ఏ-2 ముద్దాయి అయిన గంపదొర సత్తిబాబు అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు ఎస్సై సోమవారం తెలిపారు.
Similar News
News December 18, 2025
బురుజుపేట: సాయంత్రం 4 గంటల నుంచి దర్శనాల నిలిపివేత

బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. మార్గశిర మాసం ఆఖరి గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. సహస్ర ఘట్టాభిషేకానికి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టగా సాయంత్రం 4 గంటల నుంచి ఏడు గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించనున్నారు.
News December 18, 2025
విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు: కలెక్టర్

విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, కాలుష్య కారకాలను గుర్తించి వాటి తీవ్రత తగ్గించేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
News December 18, 2025
విశాఖ: స్టీల్ ప్లాంట్కు ఇన్ఛార్జ్ సీఎండీగా గుప్తా

విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇన్ఛార్జ్ సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త నాయకత్వంలో స్టీల్ ప్లాంట్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


