News December 24, 2024
పెదబయలు: ఏ-2 నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష
2014లో పెదబయలు మండలంలోని కుంతుర్ల గ్రామానికి చెందిన మజ్జి బాలరాజు అనే వ్యక్తి, అడవి పందుల కోసం వేసిన విద్యుత్ ఉచ్చులో పడి మృతి చెందాడని ఎస్సై కే.రమణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారన్నారు. అయితే ఈ ఘటనకు కారణమైన వారిలో ఏ-2 ముద్దాయి అయిన గంపదొర సత్తిబాబు అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు ఎస్సై సోమవారం తెలిపారు.
Similar News
News January 21, 2025
విశాఖలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం
విశాఖలోని పీఎం పాలెం పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. HPCL లేఔట్‌లోని ఓ ఇంటిలో బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నల్ల సాయితేజను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.
News January 21, 2025
ఏయూలో జపనీస్ భాషలో డిప్లొమా కోర్సు
విద్యార్థులు, భాషా ఔత్సాహికులకు ఉత్తేజకరమైన పరిణామంలో ఏయూ జపనీస్ భాషలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలను ప్రారంభించింది. విదేశీ భాషల విభాగాధిపతి, జపాన్ సమాచార అధ్యయన కేంద్రం డైరెక్టర్ చల్లా రామకృష్ణ నేతృత్వంలోని ప్రారంభించింది. ఆసక్తిగల విద్యార్థులు ఏయూ అడ్మిషన్స్ డైరెక్టర్ లేదా ఏయూ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. 40సీట్లు ఉంటాయి. ఆరునెలల సాయంత్రం తరగతులు నిర్వహిస్తారు.
News January 21, 2025
బొత్సకు హోం మంత్రి అనిత కౌంటర్
శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు హోం మంత్రి <<15209881>>అనిత కౌంటర్<<>> ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటనలో మాజీ మంత్రికి నిందితుడికి, సాక్షులకు తేడా తెలియడం లేదని విమర్శించారు. ఘటనలో సాక్షిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని స్పష్టం చేశారు. తప్పు చేయని వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.