News April 14, 2025
పెదబయలు: కుక్క కాటుకు విద్యార్థి మృతి

పెదబయలు మండలంలో సోమవారం విషాదం నెలకొంది. గిన్నెలకోట పంచాయతీలోని గుండాలగరువు ఎంపీపీ పాఠశాలలో 4వతరగతి విద్యార్థి మఠం ఆదిత్యరామచంద్రపడాల్ కుక్కకాటుకు గురై విశాఖ కేజీహెచ్ చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. నాలుగు నెలల క్రితం బాలుడికి కుక్కకాటు వేసిందని టీకాలు వేయకుండా నిర్లక్ష్యంతోనే రాబీస్ లక్షణాలతో మృతి చెందినట్లు కుంటుంబ సభ్యులు అన్నారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News February 25, 2026
‘రామాయణ’ బడ్జెట్ రూ.4వేల కోట్లు: నిర్మాత

నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. ‘ఈ చిత్రంపై నేను రూ.4వేల కోట్లు పెట్టుబడి పెట్టా. పార్ట్-1 షూటింగ్ దాదాపు పూర్తయింది. మూవీ స్టార్ట్ చేసే ముందు తగినంత బడ్జెట్ ఉందా అని అందరూ అడిగారు. అప్పు తీసుకోకుండా ఫస్ట్ పార్ట్ పూర్తి చేశా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకూ తెలియట్లే. దానంతట అదే జరిగిపోతుంది’ అని పేర్కొన్నారు.
News February 25, 2026
పశ్చిమ బెంగాల్ పేరు అందుకే మారలేదా?

‘కేరళం’కు ఓకే చెప్పిన కేంద్రం పశ్చిమబెంగాల్ <<19232383>>పేరును<<>> పెండింగ్‌లో ఉంచడం చర్చనీయాంశమైంది. 1999లో తొలిసారి, మమతా బెనర్జీ వచ్చాక 2011లో ఓసారి.. 2016లో మూడు భాషల్లో వేర్వేరు పేర్లతో మరోసారి, 2018లోనూ ప్రపోజల్ పెట్టగా కేంద్రం తిరస్కరించింది. తగిన ప్రామాణికాలు లోపించడం వల్ల కేంద్రం రిజెక్ట్ చేసింది. బంగ్లా పేరు బంగ్లాదేశ్‌తో పోలి ఉండటంతో విదేశాంగ శాఖ కూడా దీనిపై అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.
News February 25, 2026
లొంగు‘బాట’లో గణపతి!

TG: మావోయిస్టు అగ్రనేత గణపతి(ముప్పాళ్ల లక్ష్మణరావు) కూడా లొంగు‘బాట’లో ఉన్నట్లు సమాచారం. నేపాల్‌లో తలదాచుకుంటున్న ఆయన TG పోలీసుల ముందు లొంగిపోయేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బలగాలకు అప్పగించొద్దని ఆయన షరతు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో నేపాల్‌లో చికిత్సపొందుతున్న గణపతి ఆరోగ్యంపై క్లారిటీ రాగానే లొంగుబాటును ప్రకటించే అవకాశముందంటున్నాయి.


