News April 14, 2025

పెదబయలు: కుక్క కాటుకు విద్యార్థి మృతి

image

పెదబయలు మండలంలో సోమవారం విషాదం నెలకొంది. గిన్నెలకోట పంచాయతీలోని గుండాలగరువు ఎంపీపీ పాఠశాలలో 4వతరగతి విద్యార్థి మఠం ఆదిత్యరామచంద్రపడాల్ కుక్కకాటుకు గురై విశాఖ కేజీహెచ్ చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. నాలుగు నెలల క్రితం బాలుడికి కుక్కకాటు వేసిందని టీకాలు వేయకుండా నిర్లక్ష్యంతోనే రాబీస్ లక్షణాలతో మృతి చెందినట్లు కుంటుంబ సభ్యులు అన్నారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News

News April 11, 2026

అల్లు అర్జున్ ‘రాకా’.. యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతంటే?

image

అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్ రూ.175కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఫీమేల్ లీడ్‌గా నటిస్తోన్న దీపికా పదుకొనె రూ.25కోట్లు, కీలక పాత్రలో నటిస్తోన్న రష్మిక రూ.5కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాను రూ.700కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల రిలీజ్ చేసిన అల్లు అర్జున్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

News April 11, 2026

బాపట్ల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్

image

బాపట్ల పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చిలో మున్సిపల్ పాలకవర్గం గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

News April 11, 2026

హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌వే కోసం కసరత్తు

image

హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే కోసం మూడు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా 303.7 కి.మీ, విజయవాడ బైపాస్, ఓఆర్ఆర్ మీదుగా 293.19 కి.మీ, రాజధాని గుండా వెళ్లే 288.33 కి.మీ మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మూడింటిలో అనువైన ఒక మార్గాన్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నారు.