News March 21, 2025
పెదబయలు : మంచులో తేలుతున్న సూర్యుడు

పెదబయలు మండలం తూలం గ్రామ పరిసర కొండల్లో శుక్రవారం తెల్లవారుజామున పొగ మంచు కమ్మేసింది. అయితే తేలియాడే మేఘాలపై.. సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. పర్యాటక ప్రేమికులు ఉత్సాహంగా ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.
Similar News
News November 11, 2025
పాక్‌లో ఆత్మాహుతి దాడి వెనుక భారత్: షరీఫ్

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై విషం కక్కారు. ఇస్లామాబాద్‌లో జరిగిన <<18258453>>ఆత్మాహుతి దాడి<<>> వెనుక ఇండియా ఉందంటూ ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఢిల్లీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. అఫ్గాన్ కేంద్రంగా పనిచేసే TTP భారత్ ఆడించే తోలుబొమ్మ అని అక్కసు వెళ్లగక్కారు. ఇది అనేక మంది చిన్నపిల్లలపై దాడులు చేస్తోందని, దీన్ని ఎంత ఖండించినా సరిపోదంటూ మొసలి కన్నీళ్లు కార్చారు.
News November 11, 2025
SRCL: ATCతో యువతకు ఉపాధి అవకాశాలు

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ATC)తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ఏటీసీ కేంద్రాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. CNC మ్యాచింగ్ టెక్నీషియన్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ కోర్సులను ఉపయోగించుకోవాలన్నారు.
News November 11, 2025
SRCL: ‘సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి’

విద్యార్థినులు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకాంక్షించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తంగళ్లపల్లి విద్యాలయంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి విద్యార్థి నిత్యం తమ విద్యాలయంలోని లైబ్రరీలో బుక్స్, దినపత్రికలు చదవాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుకోవాలన్నారు.


