News February 25, 2025
పెదమేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం

జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి లోపలకి చొరబడి ధాన్యం, బియ్యం నిల్వలను చెల్లాచెదురుగా చేశాయి. నెల రోజుల్లో 2 సార్లు ఇదే మిల్‌పై దాడి చేయడంతో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చిందని బాధితులు వాపోతున్నారు.
Similar News
News February 25, 2025
జనగాం: వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలి: కలెక్టర్

రాబోయే వేసవిలో క్షేత్ర స్థాయిలో నిరంతరం విద్యుత్ ఉండాలని, దాని కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు జనగాం సూర్యాపేట రోడ్డులో ఉన్న 33/11 సబ్ స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఫీడర్ల వారీగా, LV అంతరాయాలను సమీక్షించారు. సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.
News February 25, 2025
బంగారం కాదు వెండిని కొంటా: ఫేమస్ ఇన్వెస్టర్

వెండి తక్కువ ధరకు దొరుకుతోందని ఆథర్, కమోడిటీ గురువు జిమ్ రోజర్స్ అంటున్నారు. బంగారమంటే తనకెంతో ఇష్టమని, దాని విలువ అతిగా పెరిగిందని పేర్కొన్నారు. అందుకే తాను వెండిని కొంటానని చెప్పారు. ఎకానమీ మెరుగవుతోందని, మళ్లీ పరిశ్రమలకు దాని అవసరం పెరుగుతుందని అంచనా వేశారు. ఈ 2 మెటల్స్ అత్యంత విలువైనవని వివరించారు. అలాగే అగ్రి కమోడిటీస్‌పై దృష్టి పెడతానన్నారు. Note: ఈ వార్త సమాచారం కోసమే. పెట్టుబడి సూచన కాదు.
News February 25, 2025
జనగాం: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన కలెక్టర్

జనగాం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల జీవన ఉపాధికి, ఆర్థిక స్వేచ్ఛకు క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఇంతటి విశాలమైన, శుభ్రమైన క్యాంటీన్ ప్రారంభించినందుకు మెప్మా లతాశ్రీ, ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ను కలెక్టర్ అభినందించారు.