News February 3, 2025
పెదవేగి: పాత కక్షల నేపథ్యంలో పీక కోశారు

పాత కక్షల నేపథ్యంలో పెదవేగి మండలం, పినకడిమి గ్రామానికి చెందిన మరీదు మణికంఠ అనే వ్యక్తిపై ఆదివారం రాత్రి ఒక వ్యక్తి కత్తితో దాడి చేశారు. పీకను కోయడంతో మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మణికంఠ పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 3, 2025
NGKL: గత ప్రభుత్వం టన్నెల్ పనులు పూర్తిచేయలేకపోయింది: సీఎం

గత పదేళ్లలో 10 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్పై విమర్శలు చేశారు. తమ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 30 కి.మీ.ల టన్నెల్ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి పనులు కొనసాగిస్తున్నామని సీఎం తెలిపారు.
News November 3, 2025
నెల్లూరు జైలుకు జోగి రమేష్ తరలింపు

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వారిని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఓ పక్క జోగి రమేష్ అరెస్టు అన్యాయమని, అక్రమమని వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారు.
News November 3, 2025
కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

కాశీబుగ్గ సంఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఫోన్లో మాట్లాడిన ఆయన, కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.


