News February 6, 2025
పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.
Similar News
News November 29, 2025
నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.

JN: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జనగామ జిల్లాలో మూడు దశల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, శిక్షణ, బ్యాలెట్ బాక్స్‌లు, రవాణా, భద్రత సహా అన్ని అంశాల్లో పటిష్ఠ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.