News February 17, 2025

పెద్దగట్టుకు ఎమ్మెల్సీ కవిత రాక

image

తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరైన శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు మంగళవారం ఎమ్మెల్సీ కవిత రానున్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం తెలిపారు. ఈ మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త బస్టాండ్ వద్దగల ఫ్లైఓవర్ వద్ద వారికి ఘనస్వాగతం పలకనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో చలి పంజా

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో అత్యల్పంగా 14.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి 14.2డిగ్రీలు, బిజినపల్లి, తెలకపల్లి 14.9, యంగంపల్లి 15.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News November 21, 2025

వంటగది చిట్కాలు

image

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్‌తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.

News November 21, 2025

కాట్రేనికోన: కొబ్బరి చెట్టు పైనుంచి జారిపడి కార్మికుడి మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా దొంతికుర్రులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి కర్రీ అప్పలరాజు (36) అనే వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా గోపాలపట్నం వాసిగా గుర్తించారు. కాట్రేనికోన మండలంలో తోటి కూలీలతో కలిసి దింపులు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం వచ్చిన కార్మికుడు మృతి చెందడంతో తోటి కూలీల్లో విషాదం అలముకుంది.