News February 17, 2025

పెద్దగట్టుకు ఎమ్మెల్సీ కవిత రాక

image

తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరైన శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు మంగళవారం ఎమ్మెల్సీ కవిత రానున్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం తెలిపారు. ఈ మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త బస్టాండ్ వద్దగల ఫ్లైఓవర్ వద్ద వారికి ఘనస్వాగతం పలకనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 15, 2025

నిద్రలేమితో అనారోగ్యమే!

image

మనిషికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక నిద్రలేమికి సంకేతమని చెబుతున్నారు. నిద్రలేమితో కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సరైన నిద్ర ఉంటే 30-60% రోగుల్లో ఆల్జీమర్స్, గుండె జబ్బులు తగ్గుతున్నాయని తెలిపారు. ఏకధాటిగా 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.

News March 15, 2025

ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

image

నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్‌ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News March 15, 2025

గంపలగూడెం: కనుమరుగవుతున్న మామిడి తోటలు

image

ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు డివిజన్లో మామిడి పండ్లు అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్రాధాన్యతుందో మనకి తెలిసిన విషయమే. ఆ డివిజన్లో గంపలగూడెం కూడా ఒక భాగమే. అయితే గంపలగూడెం మండల పరిధిలోని ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల మామిడి తోటలు నరికివేతకు గురయ్యాయి. దీనికి కారణం కోతులు బెడద, పంట చేతికొచ్చే సమయానికి వాతావరణంలో మార్పులు, ఇలా పలు కారణాలు వల్ల మామిడి తోటలు కనుమరుగవుతున్నాయని రైతులు వాపోయారు.

error: Content is protected !!